Sun,May 19,2024

News

ఆజాద్ సేవలు అజరామరం

20-Dec-2021 03:49 AM

విజయవాడ: 

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతికి అందించిన సేవలు అజరామరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కొనియాడారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ హిరియల్ నదీమ్ అహమ్మద్ అధ్యక్షతన విజయవాడలోని జ్యోతి కన్వేన్షన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అవార్డుల ప్రదానోత్సవానికి అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, మల్లాది విష్ణు హాజరయ్యారు. మైనారిటీ శాఖ చీఫ్ సెక్రటరీ గంధం చంద్రుడు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఆజాద్ అందించిన సేవలను వక్తలు గుర్తు చేశారు. ఆయన జీవితం ఆదర్శనీయమని, నేటి తరం నేతలు, యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. ఆజాద్ సేవలతోనే మైనారిటీలకు గుర్తింపు రాగా, ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మైనారిటీల మనస్సుల్లో నిలచిపోయారని అంజాద్ బాషా అన్నారు. అదే బాటలో ప్రస్తుత సీఎం వై.ఎస్. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చరిత్రలో శాశ్వతంగా నిలచిపోయారని నదీమ్ అన్నారు. అనంతరం ఉర్దూ విభాగానికి సంబంధించి 70 మందికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట అవార్డులు అందజేశారు. వారిలో అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ ముస్తఫా హసన్ కు లైఫ్ అచీప్ మెంట్ అవార్డు అందించారు.